Job mela | హైదరాబాద్‌లో భారీ జాబ్ మేళా!

మాదాపూర్‌లోని శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో జూలై 23వ తేదీన ఒక భారీ జాబ్ మేళా జరగనుంది. ఈ జాబ్ మేళా ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఈ మేళాలో ఫార్మా, హెల్త్, ఐటీ, ఐటీఈఎస్, ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ వంటి పలు రంగాలకు చెందిన అనేక కంపెనీలు పాల్గొని వివిధ ఉద్యోగాల కోసం అభ్యర్థులను నియమించుకుంటాయి.

కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను కూడా అందిస్తాయని నిర్వాహకుడు మన్నన్ ఖాన్ ఇంజినీర్ తెలిపారు.
పదో తరగతి (SSC) ఆపై విద్యార్హత ఉన్నవారు ఈ జాబ్ మేళాలో పాల్గొనడానికి అర్హులు. ప్రాథమిక ఇంటర్వ్యూలు అక్కడే నిర్వహించబడతాయి. ప్రవేశం ఉచితం. ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం 8374315052 నంబర్‌ను సంప్రదించవచ్చు.

Leave a Reply