ఢిల్లీ : ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 2024 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘జ్ఞానపీఠ్ అవార్డు’ను అందజేస్తారు. 1944లో ఏర్పాటైన ఈ పురస్కారాన్ని.. దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవంగా పరిగణిస్తారు. శుక్లా ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయిత. ఈ పురస్కారం కింద రూ.11 లక్షల నగదు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు.
హిందీ సాహిత్యం, విలక్షణమైన రచనా శైలికి ఆయన చేసిన అద్భుతమైన కృషికిగానూ ఈ అవార్డు వరించింది. 1999లో ఆయన సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారాన్ని అందుకున్న మొదటి రచయిత శుక్లానే కావడం విశేషం.