Jubilee hills | ప్రతిపక్షాలకు చెంపపెట్టు

Jubilee hills | ప్రతిపక్షాలకు చెంపపెట్టు
Jubilee hills | చిట్యాల, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని మండలం కాంగ్రెస్ నాయకులు ఆవుల యాదయ్య సునీత (Avula Yadayya Sunitha) హర్షం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి జూబ్లీహిల్స్ గెలుపు ప్రతిపక్షాలకు చెంపపెట్టన్నారు. ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ అభ్యర్థిని మెజార్టీతో గెలిపించారన్నారు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపొందడంతో నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజా పాలనలో పేద, బడుగు, బలహీన, వర్గాల అభ్యున్నతికి ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు మంజూరు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkata Reddy), శాసనసభ్యులు వేముల వీరేశం సహకారంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు మంజూరు చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
