ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ(Jishtu Dev Varma) నల్లగొండ(Nalgonda) పట్టణంలోని ఎం.జి యూనివర్సిటీ(To MG University)కి చేరుకున్నారు. విశ్వవిద్యాలయానికి చేరుకున్న ఆయనకు కలెక్టర్ ఇలా త్రిపాఠి(Tripathi), ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharat Chandra Pawar)లు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎంజీ యూనివర్సిటీ నాలుగవ స్నాతకోత్సవం వేడుకల్లో గవర్నర్ పాల్గొననున్నారు. పీహెచ్‌డీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసేవారికి ఆయన గోల్డ్ మెడల్స్, పట్టాలను పంపిణీ చేయనున్నారు.
ఎంజి యూనివర్సిటీ కి చేరుకున్న జిష్ణు దేవ్ వర్మ

