Meeting | ఇవాళ కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ..

Meeting | ఇవాళ కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ..

  • ఎర్రవల్లిలో కీలక సమావేశం.. రాజకీయ పరిణామాలపై చర్చ

Meeting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ కానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో ఈ సమావేశం జరగనుంది.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డికి మధ్యాహ్న భోజనానికి ఆహ్వానం అందినట్లు సమాచారం. ఈ భేటీలో బీఆర్ఎస్‌లో చేరే తేదీతో పాటు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.

జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు కొప్పుల ఈశ్వర్, ఎల్. రమణ, దామోదర్ రావు, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు హాజరుకానున్నట్లు సమాచారం.

Leave a Reply