KCR- Jeevan Reddy | మీతో కలిసి పని చేయమని..

KCR- Jeevan Reddy | మీతో కలిసి పని చేయమని..

కేసీఆర్ తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగం


ఎర్రవల్లి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) తో ఎర్రవెల్లి నివాసంలో మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వక భేటీ అయ్యారు.. కెసిఆర్ నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి, పుష్పగుచ్ఛాలందించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు (Former Ministers), కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె.విద్యాసాగర్ రావు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ దంపతులు వసంత సురేశ్, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులున్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే రైతు నాయకుడు, తెలంగాణ తనానికి దర్పణంగా నిలిచే మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి. తెలంగాణ సాధకుడు రైతు బాంధవుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలయిక సందర్భంగా భావోద్వేగ వాతావరణం నెలకొంది.

కేసీఆర్ ను కలిసిన సందర్భంగా జీవన్ రెడ్డి (Jeevan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణకు నష్టం జరుగుతున్న సమయంలో మీతో కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, మీతో కలిసి పనిచేయమని దేవుడే నన్ను మీదగ్గరికి పంపించిండు.. అన్నా. చాలా గ్యాప్ తర్వాత ఇన్నాల్లకైనా మీతో కలిసిపనిచేసే అవకాశం రావడం సంతోషంగా వుంది అన్నా..’’ అంటూ తన మనసులోని మాటను భావోద్వేగంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వ్యక్తం చేశారు.

కాగాజీవన్ రెడ్డి ని అనునయిస్తూ, వారిని అప్యాయంగా దగ్గరికి తీసుకున్న కేసీఆర్ (KCR), వారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకొని, శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. కాసేపు ఇష్టాగోష్టి తర్వాత జీవన్ రెడ్డి బృందాన్ని లంచ్ ఆథిధ్యానికి కేసీఆర్ ఆహ్వానించారు.

Leave a Reply