జేఈఈ ఆల్ ఇండియా 5వ ర్యాంకు..

సిరికొండ, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గోట్ గ్రామానికి చెందిన. జక్కు ప్రనోన్య మొన్న వెలువడిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆలిండియా 5వ, రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచి, 99.18 ర్యాంక్ సాధించిన ప్రవీణ్యను శనివారం సర్పంచ్ దడివే గణేష్, ఉప సర్పంచ్ రోండ్ల గోవర్ధన్ లు అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ.. చిన్నవాల్గొట్ గ్రామానికి చెందిన జక్కు ప్రవీణ్, స్వరూపల కూతురైన ప్రనోన్య ఆల్ ఇండియాలో 5వ ర్యాంక్, రాష్ట్రంలో మొదటి స్థానంలో రాణించడం చిన్నవాల్గోట్ గ్రామానికి గర్వకారణమన్నారు.

Leave a Reply