ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) ఆరోగ్యంపై అనేక రూమర్లు వస్తున్నాయి. ఆయన హెల్త్ సరిగా లేదని పుకార్లు పుడుతున్నాయి. ఆయనకు దీర్ఘకాల సిరల వ్యాధి (venous disease) ఉందని ఇటీవల నిర్ధారణ అయ్యింది. అయితే, ఇది సాధారణ రక్తప్రసరణ (blood circulation)వ్యాధి అని తెలిసింది. అయితే 70 దాటిన వారిలో కామన్‌గా కన్పిస్తుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (US Vice President JD Vance) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలపై జేడీ వాన్స్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలో ఎలాంటి భయంకరమైన విషాదం చోటుచేసుకున్నా, తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఇప్పటికైతే ‘అధ్యక్షుడు ట్రంప్ చాలా ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నారు. ట్రంప్‌తో పనిచేస్తున్న వారిలో చాలామంది ఆయనకంటే వయసులో చిన్నవాళ్లే. కానీ వారందరికంటే చివరిగా నిద్రపోయేది, ఉదయాన్నే మొదటగా లేచేది ట్రంప్. కొన్నిసార్లు అనుకోని విషాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ట్రంప్ మిగిలిన పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని నాకున్న నమ్మకం చాలా బలంగా ఉంది. ఆయన అమెరికా ప్రజల (American people) కోసం ఇంకా ఎన్నో మంచి పనులు చేయబోతున్నారు. ఒకవేళ అనుకోని పరిస్థితులు ఎదురైతే, అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నా’ అని వాన్స్ స్పష్టం చేశారు.