Jayaprakash Reddy | గెలిపిస్తే… సమస్తాపూర్ అభివృద్ధి చేస్తా

Jayaprakash Reddy | గెలిపిస్తే… సమస్తాపూర్ అభివృద్ధి చేస్తా


సర్పంచ్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి

Jayaprakash Reddy | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఓటు వేసి ఆదరించి గెలిపిస్తే సమస్తాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని సమస్తపూర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయప్రకాశ్ రెడ్డి అన్నారు. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. ఇవాళ‌ సమస్తాపూర్ గ్రామంలో తన మద్దతుదారులతో కలిసి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలు పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఇడ్లూరు శ్రీ శంకర్ లింగేశ్వర స్వామి దేవాలయానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తానన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం మూలంగా గ్రామ అభివృద్ధి నోచుకోలేదని సర్పంచ్ గా ఆదరిస్తే గ్రామ సర్వతోముగాభివృద్ధికి కృషి చేస్తారన్నారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత తీసుకుంటానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదలకు వచ్చే విధంగా చూస్తానని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు.

గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకున్న వ్యక్తిగా త‌న‌ను ఆదరించి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. గ్రామ అభివృద్ధికి నిస్వార్ధంగా సేవ చేసే భాగ్యం కల్పించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా అందిస్తానన్నారు. ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తూ డ్రైనేజీలు నిర్మిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply