Jannaram | సేవాలాల్ ఉత్సవాలకు నిధులు పెంచాలి

Jannaram | సేవాలాల్ ఉత్సవాలకు నిధులు పెంచాలి
- రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్
Jannaram | జన్నారం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 15 నిర్వహించే సంత సేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవాలకు నిధులను పెంచాలని తెలంగాణ బంజారా యువజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ నాయక్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలకు చాలీచాలని నిధులు ఉత్సవాలకు మంజూరు చేస్తుందన్నారు. ఉత్సవాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి ప్రతి జిల్లాకు రూ.5 లక్షల చొప్పున 33 జిల్లాలకు సీఎం కేటాయించాలని ఆయన తెలిపారు.
అదేవిధంగా అత్యధిక జనాభా ఉన్న గిరిజన లంబాడీల కొరకు ప్రభుత్వం ఆయా జిల్లా కేంద్రాలలో బంజారా బహు(భవనం) నిర్మించి బంజారాల చరిత్రను మ్యూజియంలో ద్వారా భవిష్యత్తు తరాలకు అందించే కార్యక్రమం ఏర్పాటు చేయాలని, సేవాలాల్ మహారాజ్ జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో ముద్రించి రాబోయే బంజారా విద్యార్థులకు అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బంజారా సంఘం మండల అధ్యక్షుడు ఎల్.నందు నాయక్, బంజారా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బి.శ్రీనివాస్ నాయక్, కవ్వాల, కొత్తపేట సర్పంచులు ఎల్.సక్రు నాయక్, దినేష్ నాయక్, సంఘం మండల నాయకులు రాములు నాయక్, బద్రీ నాయక్, మోహన్, రవి నాయక్ పాల్గొన్నారు.
