జ‌న్మ‌భూమి రుణం తీర్చుకుంటున్నారు ఇలా…

జ‌న్మ‌భూమి రుణం తీర్చుకుంటున్నారు ఇలా…

వెల్గటూర్ , ఆంధ్ర‌ప్ర‌భ : సొంతూరిపై మమకారంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాసరావు(పీఎస్ఆర్‌) జ‌న్మ‌భూమి రుణం తీర్చుకుంటున్నార‌ని ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని పాత గూడూర్ గ్రామ‌స్థులు అన్నారు. సొంతూరితోపాటు ప‌క్క గ్రామానికి సేవ కార్య‌క్ర‌మాలు అంద‌జేస్తున్నారు. శాలివాహన(కుమ్మరి)సంఘ భవనాన్ని రూ.15 లక్షలతో పీఆర్ఎస్ నిర్మించారు. ఆ భ‌వ‌నాన్ని ఈ రోజు ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ పోనుగోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ..త‌న‌కు జన్మనిచ్చిన ఊరి కోసం జీవితాంతం సేవ చేస్తానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పాత గూడూర్ గ్రామనికి వంద ఇండ్లు మంజూరు కాగా ఒక్కో లబ్ధిదారునికి 200 వందల సిమెంట్ బ్యాగులు ఇస్తున్నట్లు ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాసరావు(పీఎస్ఆర్‌) జగిత్యాల జిల్లా ఉమ్మడి వెల్గటూర్ మండలంలోని పాత గూడూర్ గ్రామాభివృద్ధి కి రూ. కోట్లాల్లో విరాళం ఇస్తున్నారు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి పట్నంలో స్థిరపడినా ఆయ‌న సొంత ఊరి అభివృద్ధి కోసం విరాళాలు ఇస్తున్నారు. గ్రామంలో పూసల సంఘ భవన నిర్మాణానికి రూ.30 లక్షలు, యాదవ సంఘ భవనానికి రూ.25 లక్షలు, పాఠ‌శాల‌ భవనాల నిర్మాణం కోసం రూ.కోటి విలువ చేసే సొంత‌ భూమిని విరాళంగా ఇచ్చారు.

అలాగే పోచమ్మ గుడి నిర్మాణనికి లక్షలు విలువ చేసే భూమిని, గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి 15 గుంటల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇవే కాకుండా గ్రామంలో ప్రతి వార్డుల్లో సొంత‌ ఖర్చుతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేయించారు.

Leave a Reply