నేడు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ సభ
హాజరుకానున్న పవన్ కల్యాణ్
హైదరాబాద్ నుంచి పయనం
హైదరాబాద్ – ఈ సాయంత్రం పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ వద్ద జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. ‘జయకేతనం పేరిట జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితమే హైదరాబాదులోని తన నివాసం నుంచి బయల్దేరారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాగానే, అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. పవన్ వారందరికీ అభివాదం చేశారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్ లో బేగంపేట నుంచి బయలుదేరి చిత్రాడకు వెళ్లారు.