ప్రచారం చేస్తున్న 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు

ప్రచారం చేస్తున్న 8 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు

ఎమ్మెల్యే పల్లా ప్రచారంతో గెలుపు ఖాయం
బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు

జనగామ, ఆంధ్రప్రభ : జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రచారంతో ఎనిమిదో వార్డులో గెలుపు ఖాయమని బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు ధీమా వ్యక్తం చేశారు.అదివారం 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా అభ్యర్థి పగిడిపాటి సుధా సుగుణాకర్ రాజు మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం ప్రజల కోరిక మేరకు ఎనిమిదవ వార్డు నుంచి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని తెలిపారు. శనివారం 8వ వార్డులో జనగామ శాసన సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం నిర్వహించడంతో వార్డులో జోష్ పెరిగిందని ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్త ఉత్సహంతో గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నీలిమా ఆసుపత్రిలో వేలాదిమందికి ఉచిత వైద్యం అందిస్తున్న ఎమ్మెల్యే రాజేశ్వర్ రెడ్డి కి మద్దతు పెరుగుతుందని అన్నారు.వార్డు సమస్యలు పరిష్కరిస్తూ, అభివృద్ధి పనులు చేపడతామని ఆమె తెలిపారు.ప్రజల ఆదరణ బాగుందని, తమ గెలుపు ఖాయమని ఆమె ఆశా భావం వ్యక్తం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply