Jakran Palli | ఉపసర్పంచ్ బీఆర్ఎస్ కైవసం

Jakran Palli | ఉపసర్పంచ్ బీఆర్ఎస్ కైవసం

Jakran Palli | జక్రాన్ పల్లి, ఆంధ్రప్రభ : జక్రాన్ పల్లి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నట్ట భోజన్న గెలుపొందారు. నిన్న జరిగిన ప్రాథమిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా జక్రాన్ పల్లి గ్రామపంచాయతీ కాంగ్రెస్ అభ్యర్థి బండి పద్మ కైవసం చేసుకుంది. ఉప సర్పంచ్ ఎన్నిక నిన్న జరగవలసి ఉండగా, ఈరోజు ఉదయం 11 గంటలకు భారీ పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించారు. 8మంది వార్డు సభ్యులతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నట్ట భోజన్న ఉప సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ కార్యక్రమంలో డి. ఎల్ .పి. ఓ. శివకృష్ణ, జక్రన్ పల్లి ఎం.డి.ఓ సతీష్ కుమార్, ఎమ్మార్వో కిరణ్మయి, ఏసీపీ రాజశేఖర్, డిచ్పల్లి సిఐ వినోద్, సుమన, స్థానిక ఎస్సై మహేష్, సందీప్, హరీష్, ఇతర పోలీస్ సిబ్బంది ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply