Jainoor | విబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని నిరసన

Jainoor | విబీ జీ రామ్ జీ పథకాన్ని రద్దు చేయాలని నిరసన
Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ జీ ఉపాధి హామీ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టిందనీ ఆ పథకాన్ని రద్దుచేసి గత కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మండలంలోని మాని గూడ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ జాదవ్ జనాబాయి గణపత్ నాయక్ ఉపసర్పంచ్ గ్రామస్తులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జానా గణపత్ నాయక్ మాట్లాడుతూ… గత మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకాన్నే కొనసాగించాలని మహాత్మ గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా కూలి నాలి చేసే ప్రజలతో పాటు అట్టడుగు వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని వారు డిమాండ్ చేశారు. జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని మార్చడం సరికాదని అన్నారు. నిరుపేదలకు ఉపాధి కల్పించడానికి గత ప్రభుత్వం ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వం పథకాన్ని పేరు మార్చడం సమంజసం కాదని వారన్నారు. పాతపథకాన్నికొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాణిగూడ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్ ఆత్రం భీంరావ్, నాయకులు కినక కిషన్, సిదాం, పర్సురాం, వార్డు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
