అమరావతి : ‘ఆపరేషన్ సిందూర్’ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. పాకిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రశంసించారు. “హేయమైన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత రక్షణ దళాలు ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించాయి. ఇటువంటి సమయాల్లో, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటంలో, పౌరులను రక్షించడంలో దేశం అచంచలమైన బలాన్ని ఇటువంటి అనివార్యమైన చర్యలు ప్రతిబింబిస్తాయి. మేమంతా మీకు అండగా ఉంటాం. జై హింద్,” అని జగన్ మోహన్ రెడ్డి తన సందేశంలో తెలిపారు.
AP | మేమంతా అండగా ఉన్నాం : వైఎస్ జగన్
