జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి..

జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం బస్ స్టాండ్ వద్ద ఆదివారం జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకల్లో విజయ రమణారావు పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి స్థానిక నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి మహనీయులకు ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, కౌన్సిలర్లు, దళిత సంఘాల నాయకులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
