సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి

సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి
- దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : సామాజిక న్యాయం సాధనకు అపారమైన కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని దుబ్బాక పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ స్వాతంత్ర్యం, సామాజిక సమానత్వం కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రాం అని పేర్కొన్నారు. కులరహిత సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
