ADB | దళితుల కోసం పోరాడిన మహానీయుడు జగ్జీవన్ రామ్.. బొజ్జు ప‌టేల్

ఉట్నూర్, ఏప్రిల్ 5 (ఆంధ్రప్రభ) : దళితుల సామాజిక రాజకీయ హక్కుల కోసం పోరాడిన మహానేత మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. శనివారం ఉట్నూర్ లో స్వతంత్ర సమరయోధులు, మహనీయులు, బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించగా, ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పాల్గొన్న నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బోజ్జు పటేల్ మాట్లాడుతూ… బాబు జగ్జీవన్ రామ్ అంటరాని వారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన 1908లో ఒక సామాన్య రైతు అయిన సోబిరామ్ వసంతి దేవిలకు విహారలోని షహాబాదు భోజపురి జిల్లాలోని చంద్వా అనే గ్రామంలో జన్మించారన్నారు. అతి చిన్న వయసులోనే బాబు జగ్జీవన్ రావు మంత్రి అయ్యారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన చేసిన సేవలు ఎంతో గొప్పవని, చిరస్మరణీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి చంద్రయ్య, ఆదిలాబాద్ ఆర్టిఏ సభ్యులు దూట రాజేశ్వర్, నాయకులు బిరుదుల లాజర్, కొత్తపెళ్లి మహేందర్, ముడుగు స్వాముల్, ఆశన్న, వివిధ దళిత సంఘాల నాయకులు, దళితులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply