జబ్బార్ బస్సు బోల్తా.. అసలు జరిగింది ఇదే..
చెన్నేకొత్తపల్లి (ఆంధ్రప్రభ):
శ్రీ సత్య సాయి జిల్లా సికేపల్లి మండలం దామాజుపల్లి వద్ద జాతీయ రహదారి 44 పై మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ఐదు నిమిషాలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సురక్ష (30) అనే మహిళ మృతి చెందగా మరో ఆరు మందికి గాయాలు అయ్యాయి. ఐచర్ వాహనం యూటర్న్ తీసుకుంటున్న సమయంలో పూర్తిగా ఎడమ వైపుకు రావడంతో బస్సు డ్రైవర్ ఒకసారిగా సడన్ బ్రేక్ వేయడంతో బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. జబ్బార్ ట్రావెల్స్ కు చెందిన బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. బస్సు డ్రైవర్ మహమ్మద్ ఇర్ఫాన్ తెలిపిన సమాచారం మేరకు.. జబ్బార్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తుంది.
సికేపల్లి మండలం దామాజు పల్లి వద్ద ఐచర్ వాహనం యూటర్న్ తీసుకునే నిమిత్తం ఐచర్ వాహనాన్ని డ్రైవర్ ఎక్కువగా ఎడమవైపుకు తీసుకోవడంతో సడన్ గా బ్రేకులు వేయడంతో ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది అన్నారు. ఆ సమయంలో వేగం కూడా తగ్గించడం జరిగిందన్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే.. ప్రయాణికులను అప్రమత్తం చేసి పలువురుని ప్రమాదం నుంచి కాపాడామన్నారు. ఇందుకు బస్సులోని ప్రయాణికులు సైతం సహకరించారు. అయితే.. తీవ్రంగా గాయపడ్డ సురక్ష అనే ప్రయాణికురాలును అనంతపురం తీసుకెళ్తుండగా మృతి చెందింది అన్నారు. అయితే.. ఆరుగురుకి గాయాలయ్యాయి. బస్సులో సుమారు 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు డ్రైవర్ తెలిపారు. విషయం తెలిసిన వెంటనే.. సికేపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, బాధితులను అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

