జమ్మూకశ్మీర్, ఆంధ్రప్రభ :
ప్రధాని మోదీ జూన్ 6వ తేదీన జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఆ రోజు ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్‌ను ప్రారంభించనున్నారు. చీనాబ్ నదిపై అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ నిర్మించారు. ఏప్రిల్ 22వ తేదీన పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత తొలిసారి ప్రధాని జమ్మూకశ్మీర్‌కు వెళ్తున్నారు. చీనాబ్ నదిపై రైల్వే బ్రిడ్జ్ ఓపెనింగ్ అంశాన్ని పీఎంవో సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. మరో మూడు రోజుల్లో చరిత్ర చోటుచేసుకోనున్నట్లు చెప్పారు.
విపత్తులను తట్టుకునేలా..
ఉదంపూర్.. శ్రీనగర్.. బారాముల్లా రైల్వే లింక్ రూట్‌లో చీనాబ్ నదిపై బ్రిడ్జ్‌ను నిర్మించారు. ప్రకృతి విపత్తులను తట్టుకునే రీతిలో దాన్ని దృఢంగా తయారు చేశారు. నవ భారతానికి చెందిన శక్తికి, విజన్‌కు ఆ బ్రిడ్జ్ చిహ్నంగా నిలుస్తుందని మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. చీనాబ్ నదిపై సుమారు 358 మీటర్ల ఎత్తులో బ్రిడ్జ్‌ను నిర్మించారు. ఇది పారిస్‌లోని ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్లు ఎత్తుగా ఉంటుంది.