మహా ముత్తారం, ఏప్రిల్ 8 ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో పులి భయం ప్రజల కంట మీద కునుకు లేకుండా చేస్తుంది. కొద్దిరోజులుగా ఈ ప్రాంతంలో పులులు సంచరిస్తున్నట్లు సమాచారం ఉండడంతో అటవీ గ్రామాల ప్రజలు బయటకు వెళ్లడానికి జంపుతున్నారు. పెద్దపులి ఈ ప్రాంతం నుండి వెళ్లిపోయిందని అటవీశాఖ అధికారులు చెప్పినప్పటికీ ఆ భయం మాత్రం ప్రజల్లో పోవడంలేదు.
ఈ తరుణంలో ఇవాళ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలం కోనంపేట అటవీ ప్రాంతంలో అడవిలో కొంతమంది పాదముద్రలను గుర్తించి మళ్లీ పెద్దపులి వచ్చిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఆ గుర్తులు పరిశీలించారు. అవి పులి అడుగులు కావని హైనా అనే ఒక అటవీ జంతువు అని గుర్తించారు.
హైనా పాదముద్రలుగా గుర్తించిన అటవీశాఖ అధికారులు..
అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించగా.. ఇవి పెద్దపులివి కావని, హైనా అనే అటవీ జంతువు అడుగు గుర్తులని అటవీ శాఖ అధికారి ఉష తెలిపారు.