TG | రానున్న మూడు రోజులు వర్షాలు !
రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. అయితే, వాతావరణ కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. నిన్న (గురువారం) సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి.. హైదరాబాద్ శివారుల్లో వర్షం కురిసింది. ఈ క్రమంలో రానున్న రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.