TG | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర‌ మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) ఇంట్లో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు (IT officers). ఇంజనీరింగ్, మెడికల్ సీట్ల విషయంలో స్టూడెంట్స్ (Students) నుంచి భారీగా ఫీజులు వసూలు చేశారన్న ఆరోపణలున్న క్రమంలో.. గురువారం ( జులై 24 ) మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేపట్టారు అధికారులు. స్టూడెంట్స్ నుంచి వసూలు చేసిన సొమ్మును ఆదాయ పన్నులో చేర్చడంలో హెచ్చుతగ్గులు గుర్తించినట్లు తెలిపారు ఐటీ అధికారులు.

మల్లారెడ్డి ఇంటితో పాటు ప్రీతిరెడ్డి (Prithi Reddy), భద్రరెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు కొత్త కాదు గతంలో కూడా మెడికల్ కాలేజీ సీట్ల అంశం (Medical college seats issue) లో ఐటీ, ఈడీ సోదాలు జరిగాయి. మల్లారెడ్డి ఇల్లు, యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో పలుమార్లు ఐటీ సోదాలు నిర్వహించారు అధికారులు.

Leave a Reply