తిరుమల : ఇస్రో సేవలను టీటీడీ వినియోగించుకోనుంది. అందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమల. అక్కడ కొలువైన శ్రీవారిని ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. టికెట్ల పంపణీ నంచి అన్ని రకాలైన సేవలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేస్తారు. అయితే వాహాన సేవల్లో పాల్గొనే భక్తుల సంఖ్యలను టీటీడీ లెక్కిస్తుంది. అందుకుగాను కచ్చితమైన సంఖ్యను తెలుసుకోవడానికి టీటీడీ అధికారులు ఇస్రోను రంగంలోకి దించుతున్నారు.
Also Read | Tragedy | బాలుడి ప్రాణం తీసిన దోశ …
తిరుమలలో అన్ని సేవల్లో గరుడ వాహన సేవ అంటే చాలా ప్రసిద్ది. గరుడవాహన సేవలను తిలకించడానికి భక్తులు తిరుమలలో కిక్కిరిసిపోతారు. కాగా.. సెప్టెంబర్ 24న ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే గురుడోత్సవం రోజున మాడవీధుల్లో ఎంత మంది భక్తులు దర్శించుకుంటారనే అవకాశం ఉందన్నది ఇస్రో ద్వారా టీటీడీ తెలుసుకోనుంది. అందుకుగాను శాటిలైట్ ద్వారా గుర్తించనున్నారు. సమాచారాన్ని తెలుసుకునేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. తద్వారా ఏర్పాట్లు చేయనున్నారు.

