అర్థ‌మయ్యేలా బోధిస్తున్నారా?

విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్న ఎంఈఓ సాంబశివరావు
పాఠ‌శాల‌ల ఆక‌స్మిక త‌నిఖీ
విద్యార్థుల‌తో క‌లిసి సహ‌పంక్తి భోజ‌నం

శావల్యాపురం, అక్టోబర్ 17 (ఆంధ్రప్రభ) : విద్యార్థులకు అర్థమయ్యేలా ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య బోధించాల‌ని అందించాలని మండ‌ల విద్యాశాఖ అధికారి (Mandal Education Officer) మద్దికుంట సాంబశివరావు కోరారు. సామర్థ్యాలు తక్కువగా ఉన్న విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. మండల కేంద్రంలోని డీపీఈపీ అదేవిధంగా ఎంపీపీ టీడబ్ల్యూ పాఠశాలలను శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిక పరిశీలించి, ఉపాధ్యాయులు సమయపాలన గురించి ఆరా తీశారు.

విద్యార్థుల పాఠ్యపుస్తకాలను చూసి వారి శక్తి సామర్థ్యాల‌ను, వర్క్ బుక్స్, ఉపాధ్యాయ ప్రణాళికలను, సిలబస్‌ను పరిశీలించారు. డొక్కా సీతమ్మ (Dokka Seethamma) మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. హెచ్ఎంలు బి.రవి, చెంచులక్ష్మి ఉన్నారు.

Leave a Reply