అతివేగమే కారణమా..

అతివేగమే కారణమా..

ఊయ్యురు, ఆంధ్రప్రభ – కృష్ణా జిల్లా పెనమలూరు (Penamaluru) నియోజకవర్గం ఊయ్యురు మండలం ఉయ్యూరు – గండిగుంట సమీపంలో జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. స్ట్రామ్ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో విజయవాడ, కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. జాతీయ రహదారి పై నుంచి సర్వీస్ రోడ్డులో సుమారు 50 మీటర్ల మేర పల్టీలు కారు కొట్టింది.

చెల్లాచెదురుగా మృతదేహాలు పడిపోయాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయవాడ (Vijayawada) మొగల్రాజపురం నుంచి కారులో వచ్చిన ఇద్దరు, కుందేరులో మరో ఇద్దరు స్నేహితులను ఎక్కించుకుని ఉయ్యూరు వస్తుండగా ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన కారు హైవే పై ఉన్న డ్రైనేజీ గోడను ఢీ కొట్టడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. చింతయ్య (17), రాకేష్ బాబు (24), ప్రిన్స్ (24) అనే ముగ్గురుగా గుర్తించారు.

Leave a Reply