వివాదాల్లోకి లాగ‌డం మంచిదికాదు..

అమ‌రావ‌తి, ఆంధ్రప్రభ : నంద్యాలలో ఉన్న జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం ఆలయాన్ని నూతనంగా ఏర్పడే మార్కాపురం జిల్లాలో కలపాలన్న ప్రతిపాదన ఏదీ లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి(Dr. Dola Bala Veeranjaneya Swamy) పేర్కొన్నారు. మీడియాలో వస్తున్న ప్రచారాలపై మంత్రి స్పందించి పవిత్ర పుణ్యక్షేత్రం(a holy shrine) శ్రీశైలం ఆలయాన్ని వివాదాల్లోకి లాగడం మంచిదికాదన్నారు. కొంతమంది వ్యక్తులు రెండు జిల్లాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ చెప్పలేదని, కమిటీ మాత్రం నూతనంగా ఏర్పడే మార్కాపురం జిల్లా(Markapuram District)లోమార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, పశ్చిమ ప్రాంతాలను మార్కాపురం కేంద్రం(Markapuram Center)గా జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలన్న ప్రతిపాదనలేదని మంత్రి కుండబద్దలు కొట్టారు.

మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి వస్తున్న ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రజలు ఎవ్వ‌రూ ఆందోళన చెందొద్దన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ అంశంపై ఎవరూ మీడియాలో దుష్ప్రచారం చేయొద్దని ప్రజలను కోరారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. శ్రీశైలం మండలాన్ని(Srisailam Mandal), జలాశయాన్నిఇప్పుడున్న నంద్యాల జిల్లాలోనే ఉంటుందని ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టంగా తెలిపారు.

Leave a Reply