ఎలా బయటపడింది??

అపజయమెరుగని దర్శకధీరుడు జక్కన్న… ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఎక్కుతూ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన మన రాజమౌళి కెరీర్ లోనే బాహుబలి సిరీస్ గొప్ప మైలురాళ్ళు.

బాహుబలికి ముందా, తర్వాతా అనేంతగా ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానమేర్పరచుకున్న బాహుబలి గురించి అప్పట్లో జక్కన్న డీలా పడ్డారట.

యెస్… మీరు విన్నది నిజమే.. విడుదలైన మొదటి రోజు ఫ్లాప్ టాక్ రావడంతో చాలా నిరాశకు గురయ్యానని, ఎందుకంటే తనను నమ్మి నిర్మాతలు మూడేళ్ళపాటు ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాణాన్ని సాగించారనీ, ఒకవేళ ఇది డిజాస్టర్ అవుతే వాళ్ళ పరిస్థితేమిటని చాలా బాధపడ్డానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి.

కానీ నెమ్మదిగా పుంజుకుని, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన బాహుబలి: ది బిగినింగ్ విజయంతో ఊపిరి పీల్చుకున్నాం. అదే సినిమాతో బాహుబలి-2 కి మార్గం సుగమమైంది. ముఖ్యంగా కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ట్విస్ట్ అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో, ఆ సస్పెన్స్ కారణంగా బాహుబలి: ది క‌న్‌క్లూజన్ కోసం ప్రేక్షకులు ఎంత ఉత్కంఠగా ఎదురు చూశారో అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ నెలలో, ఈ రెండు సినిమాలను కలిపి బాహుబలి: ది ఎపిక్ పేరుతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఈ భారీ విజువల్ వండర్ 31 అక్టోబర్ 2025న థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించేందుకు IMAX, 4DX, D-Box, ScreenX, ICE, Dolby Cinema, EPIQ వంటి ప్రీమియమ్ ఫార్మాట్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.

Leave a Reply