Iran Us Ceasefire : జలతంత్రం Andhra Prabha Top Story

Iran Us Ceasefire : జలతంత్రం Andhra Prabha Top Story
- మహా అవరోధం
- సీజ్ ఫైర్ తాత్కాలికం
- ముందుంది.. అసలు కథ
- చివరి నిమిషంలో అసాధ్య సంధి
- హోర్ముజ్ చుట్టూ వ్యూహాత్మక పోటీ
- సుంకాల విధానం… కొత్త వివాదానికి నాంది
- అమెరికా 5వ ఫ్లీట్ పాత్ర ఎంత కీలకం?
- పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో కీలక మలుపు
ఆంధ్రప్రభ, వాష్టింగ్టన్ ప్రతినిధి
ఇరాన్ నాగరికత అంతమే లక్ష్యంగా.. సర్వ సన్నద్ధం అవుతున్న తరుణంలో.. చివరి నిమిషంలో అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ రాజీ ఒప్పందం తమ దేశాలకు లభించిన విజయంగా రెండు దేశాల అధినేతలు అభివర్ణించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేసి, చారిత్రాత్మక చమురు సంక్షోభానికి దారి తీస్తున్ప క్షణాల్లో ఈ ఒప్పందం తాత్కాలికంగా విరామం ఇచ్చింది. ఇందుకు యావత్తు ప్రపంచం హర్షాతిరేకం వ్యక్తం చేస్తోంది. కానీ తమ మధ్య చర్చలో కీలక పాత్ర పోషించే అంశాలపైనే ఏకాభిప్రాయం ఎంత వరకు కుదురుతుందో… సమాధానం లేని ప్రశ్నే.
Iran Us Ceasefire : సీజ్ ఫైర్ ఆలోచన.. ఎలా?

అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ చివరి నిమిషంలో కాల్పుల విరమణకు అంగీకరించాయి: సంఘర్షణను తీవ్రతరం చేయడానికి ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కేవలం ఒక గంట ముందు, అమెరికా, ఇరాన్ , ఇజ్రాయెల్ మంగళవారం రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. హోర్ముజ్ జలసంధిని తాత్కాలికంగా తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించగా, ఇజ్రాయెల్ భాగస్వామ్యాన్ని వైట్ హౌస్ ధృవీకరించింది. కాల్పుల విరమణ కోసం ఒత్తిడి చేసిన పాకిస్తాన్ నాయకత్వంతో చర్చల అనంతరం ఈ పురోగతి సాధ్యమైంది.
Iran Us Ceasefire : అయ్యారే.. సంధి తంత్రం

కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, సురక్షిత ప్రయాణానికి సమన్వయం కర్తను రంగంలోకి దించుతారు. ప్రయాణించే ఓడలపై రవాణా రుసుములను వసూలు చేయడానికి ఇరాన్ , ఒమన్ కు అనుమతి ఇస్తారు. . ఈ ఆదాయాన్ని యుద్ధానంతర పునర్నిర్మాణం కోసం ఉపయోగించాలని ఇరాన్ యోచిస్తోంది. పాకిస్తాన్ ధానమంత్రి మధ్యవర్తిత్వంతో శుక్రవారం ఇస్లామాబాద్‌లో చర్చలు జరుగుతాయి. ఆంక్షలను ఎత్తివేయడం, యుద్ధ నష్ట నిధిని ఏర్పాటు చేయడం, గల్ఫ్ నుంచి అమెరికా సైనిక దళాలను ఉపసంహరించే అవకాశం, అణ్వాయుధాలు తయారు చేసేది లేదని వాగ్దానం చేసినందుకు బదులుగా యురేనియంను సుసంపన్నం చేసుకునే ఇరాన్ హక్కును గుర్తించాలి. అనే ప్రతిపాదనలలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలలో దేనికైనా అమెరికా అంగీకరించిందో లేదో స్పష్టంగా తెలియదు.
Iran Us Ceasefire : ఆ రెండు డిమాండ్లే అవరోధం

సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటనలలో ఇరాన్ రెండు ప్రధాన డిమాండ్లు చేసింది. మధ్యప్రాచ్యంలో అమెరికా నౌకాదళం కొనసాగుతున్న ఉనికిపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మొదటిది, హోర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లే ఓడలపై సుంకాలు విధించాలని టెహ్రాన్ కోరుతోంది. రెండవది, ఆ ప్రాంతం నుంచి అమెరికా యుద్ధ బలగాలను తొలగించాలి. ఒక కీలక ప్రశ్న ఏమిటంటే, ఈ సుంకాలు యుద్ధ నౌకలకు వర్తిస్తాయా?లఏదా? అమెరికా నౌకాదళం 5వ ఫ్లీట్, యూఎస్ నేవల్ ఫోర్సెస్ సెంట్రల్ కమాండ్, పర్షియన్ గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. 5వ ఫ్లీట్, పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఎర్ర సముద్రం, హిందూ మహాసముద్రంలోని కొన్ని భాగాలతో సహా 25 లక్షల చదరపు మైళ్ల జల ప్రాంతం అమెరికా ఆధీనంలో ఉంది.
Iran Us Ceasefire : హోర్ముజ సవాల్..

హోర్ముజ్ జలసంధితో పాటు, 5వ ఫ్లీట్ ఎర్ర సముద్రం ఉత్తరం దిశ వైపు సూయజ్ కాలువ. దక్షిణాన బాబ్ ఎల్-మండేబ్ జలసంధి తదితర కీలక సముద్ర మార్గాలను కూడా పర్యవేక్షిస్తుంది. సుంకం చెల్లించాల్సి వస్తే, పర్షియన్) గల్ఫ్‌కు అమెరికా సైనిక ప్రాప్యతను స్పష్టంగా దెబ్బతీస్తుంది,” అని విశ్లేషకుల అభిప్రాయం. మధ్యప్రాచ్య గల్ఫ్ ప్రాంతంలో సెంట్రల్ కమాండ్ (CENTCOM) వైఖరిని పూర్తిగా మార్చాలని ట్రంప్ ఉద్దేశించకపోతే, ఈ సుంకం విధానం ఎలా నిలబడుతుందో అర్థం కాని ప్రశ్న.
Iran Us Ceasefire : తూచ్ తప్పదా?

హోర్ముజ జలసంధిని తమ సొంతం చేసుకోవటానికి ఇరాన్ శతవిధాల ప్రయత్నిస్తుంది. ఇక తన జలసంధిని తెరిపించటానికే భీకర యుద్ధానికి పిద్ధపడిన అమెరికా.. సాధాసీదా చర్చల్లో హోర్ముజ జలసంధిని ఇరాన్ కు అప్పగించే అవకాశమే లేదు. ఇరాన్ 10 సూత్రాల డిమాండ్లకు అమెరికా తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించింది? ఎందుకంటే.. ఇరాన్ భారీ యుద్ధాన్ని మిగిలిన దేశాలు అంగీకరించవు. అటు రష్యా గ్యారేజీ, చైనా మెకానిక్ లు సహించరు..ఫలితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి పరిస్థితులు దారి తీస్తాయి. అందుకే చివరి నిముషంలో ఇరాన్ వచ్చి నిలబడితే చాలు అని ఎదురు చూసిన అమెరికా అధ్యక్షుడికి పాకిస్థాన్ మంచి కబురు చెప్పింది. ఫలితంగా.. ఘోర యుద్ధానికి తెరపడింది,
