Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News

Iran Missile Strike : డ్రోన్ల ఫ్యాక్టరీ ధ్వసం Andhra Prabha News
- ఇజ్రాయెల్ మౌనం
- ఇరాన్ అనూహ్య దాడి
- పెటా తిక్వా నగరంలో భారీ పేలుడు
- ఏరో సోల్ సంస్థకు భారీ నష్టం
- రక్షణ రంగానికి కీలక కేంద్రం ధ్వంసం
- ఆలస్యంగా వెలుగులోకి ఘటన
- తప్పిన ప్రాణనష్టం
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం
( ఆంధ్రప్రభ, జెరుసలేం ప్రతినిధి)

ఆపరేషన్ ఎథిక్ ప్యూరీలో… అమెరికా చాటు రాజ్యంగా ఇజ్రాయెల్ రెచ్చిపోతోంది. ఇటు ఇరాన్ అటు లెబనాన్ పై దూసుకుపోతోంది. ఇప్పటికే ఇరాన్ ఇంధన కర్మాగారాలు.. విద్యాసంస్థలు.. ఆసుపత్రులపై గురి పెట్టింది. దొరికిన అవకాశాన్ని అసలు వదలటం లేదు. ఇక లెబనాన్.. ఇరాన్ పై గాజా వ్యూహం అమలు చేయటానికి సర్వసన్నద్ధం అవుతోంది. సరీగా ఇదే తరుణంలో ఇరాక్ కూడా ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చింది. ఏ ఆయుధాలతో లెబనాన్, ఇరాన్ పై విరుచుకు పడుతోందో.. అదే ఆయుధ కర్మాగారాన్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ కబురు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ మీడియా ఈ సమాచారాన్ని బయట ప్రపంచానికి అందించింది. వివరాలు ఇలా ఉన్నాయి.
\
Iran Missile Strike : ఏరో సోల్ ధ్వంసం

సెంట్రల్ ఇజ్రాయెల్ పెటా తిక్వా (Petah Tikva) నగరంలోని ఒక డ్రోన్ తయారీ కేంద్రంపై ఇరాన్ ఒక శక్తివంత క్షిపణితో దాడి చేసింది. ఏరో సోల్ ఏరోనాటికల్ సొల్యూషన్స్ (Aero Sol Aeronautical Solutions) అనే సంస్థకు చెందిన ఫ్యాక్టరీ అని ఇజ్రాయెల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖకు కీలక డ్రోన్ విడిభాగాలను తయారు చేస్తుంది. ఇరాన్ క్షిపణి నేరుగా తగలడం వల్ల భారీ విస్ఫోటనం సంభవించింది, ఫ్యాక్టరీ మౌలిక సదుపాయాలు, యంత్రాలు కార్యాలయాలు పూర్తిగా నాశనమయ్యాయి. ఫ్యాక్టరీ మళ్ళీ పనులు ప్రారంభించలేనంతగా దెబ్బతిన్నట్లు ఆ సంస్థ సీఈఓ ధృవీకరించారు.
Iran Missile Strike : తప్పిన ప్రాణ నష్టం

ఈ ఘటన భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 3, శుక్రవారం తెల్లవారుజామున (సుమారు గం. 1:30 – 3:00 మధ్య) జరిగింది. ఈ దాడి జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పిందని, అయితే సమీపంలో ఉన్న ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలయ్యాయని నివేదికలు చెబుతున్నాయి.
