Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్​ Andhra Prabha News

Iran Missile Attack : హైఫాలో.. హైటెన్షన్​ Andhra Prabha News

  • ఇరా.న్​ మిసైల్​ దాడి
  • కూలిన ఏడంతస్థుల భవనం
  • 11 మందికి గాయాలు
  • వీరిలో ముగ్గురు వృద్ధులు.. ఓ చిన్నారి
  • సహాయ చర్యల్లో ఇజ్రాయోల్​ బిజీబిజీ

( ఆంధ్రప్రభ, జెరుసలేం ప్రతినిధి)

Iran Missile Attack

ఇజ్రాయెల్​ పై ఇరాన్​ దూకుడు పెంచింది. సోమవారం తెల్లవారుజామున క్షిపణులతో దాడికి దిగింది. ఇజ్రాయెల్​ హైఫా నగరంలో ఏడు అంతస్తుల భవనంపై క్షిపణి దాడి జరిగింది. ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి హైఫాలోని ఏడు అంతస్తుల భవనాన్ని నేరుగా తాకింది. ఈ దాడితో భవనం పాక్షికంగా కుప్పకూలింది.

Iran Missile Attack

శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు వృద్ధులు, ఒక చిన్నారి ఉన్నట్లు సమాచారం. 82 ఏళ్ల వృద్ధుడు తీవ్రంగా గాయపడగా, మరో ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తం 11 మంది గాయపడినట్టు సమాచారం. ఇజ్రాయెల్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీస్, హోమ్ ఫ్రంట్ కమాండ్ సంయుక్తంగా శిథిలాలను తొలగిస్తూ బాధితులను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాయి. భవనం కుప్పకూలే స్థితిలో ఉండటంతో సహాయక చర్యలు చాలా క్లిష్టంగా మారాయి.

Iran Missile Attack : జెరూసలంలోనూ…

Iran Missile Attack

జెరూసలంలో కూడా సోమవారం తెల్లవారుజామున ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జెరూసలం ఆకాశంలో క్షిపణులు వాటిని అడ్డుకునేందుకు ఇంటర్సెప్టర్లు ను ఇజ్రాయెల్​ ప్రయోగిస్తోంది. తెల్లవారుజామున నగరం అంతటా సైరన్లు మోగాయి. ఇరాన్ క్షిపణుల దాడిని ఇజ్రాయెల్ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు సైన్యం ధృవీకరించింది.

ALSO READ : Dead Line Tension : ఇక అమీతుమీ Andhra Prabha TOP Story

Leave a Reply