IPS కమలాసన్‌ పదవీ కాలం పెంపు

హైదరాబాద్‌ : ఎక్సైజ్‌ శాఖలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహించి బుధవారం పదవీ విరమణ చేసిన వీ కమలాసన్‌ రెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేండ్లు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం స‌ర్కార్ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఓఎస్డీగా క‌మ‌లాస‌న్ రెడ్డిని ప్ర‌భుత్వం నియ‌మించింది. ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ డైరెక్ట‌ర్‌గా పూర్తి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ను వెంటనే సీఎస్‌కు రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో కోరింది.

Leave a Reply