IPL | కోహ్లీ వీర విహారం.. కొత్త రికార్డు సృష్టించిన విరాట్ !

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ 2025లో విరాట్ కోహ్లీ కొత్త రికార్డ్ సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ అయిన కోహ్లీ.. తన అద్భుతమైన ఐపీఎల్ కెరీర్‌లో మరో ఘనత సాధించాడు.

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా, 8000 పరుగుల మైలురాయిని దాటిన ఏకైక ఆటగాడిగా నిలిచిన కోహ్లీ, టోర్నమెంట్‌లో 1000 బౌండరీలు సాధించిన తొలి ఆటగాడిగా కొత్త రికార్డ్ లిఖించాడు. ఈరోజు (గురువారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

Leave a Reply