ipl 2026| టాప్ ప్లేస్‌లో ఎవరంటే..?

ipl 2026| టాప్ ప్లేస్‌లో ఎవరంటే..?
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభమై పది రోజులు దాటింది. ఇప్పటికే ఒక్కో జట్టు రెండు మూడు మ్యాచులు మాత్రమే ఆడాయి. కానీ కొన్ని జట్లు వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి. నాలుగు జట్లు ప్లేఆఫ్ దిశగా అడుగులు వేస్తున్నాయి. గత సీజన్‌లో సూపర్‌గా ఆడిన కొన్ని జట్లు ఈ ఏడాది కూడా అదే జోరును సాగిస్తున్నాయి. టైటిల్ సాధించే దిశగా సాగుతున్నాయి. మరికొన్ని జట్లు టైటిల్ ఫేవరెట్లుగా చెప్పుకున్నప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. కొన్ని జట్లు ఇంతవరకు గెలుపు ఖాతాను తెరవలేదు. ఇప్పుడు టేబుల్ టాప్‌లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

పంజాబ్, బెంగళూరు జట్లు వరుస విక్టరీలు సాధిస్తూ టేబుల్ టాప్‌లో ఉన్నాయి. ఈ రెండు జట్లు ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ రెండు జట్లు రన్ రేట్ ఆధారంగా ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన రెండు స్థానాల కోసం రాజస్థాన్, ఢిల్లీ, ముంబై , హైదరాబాద్ పోటీ పడుతున్నాయి.

అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీ ఉన్నాయి. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో కూడా అదే ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలతో టేబుల్ టాపర్‌గా నిలవడమే కాకుండా ప్లే ఆఫ్స్ రేసులో అందరికంటే ముందంజలో ఉంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కూడా అదే జోరు చూపుతోంది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతూ తమ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కొనసాగుతున్నాయి. రాజస్థాన్ జట్టు తన యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచగా ఢిల్లీ జట్టు అనుభవజ్ఞులైన సీనియర్ల అండతో దూసుకుపోతోంది. ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్స్ స్థానం కోసం గట్టి పోటీనిచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో రాజస్థాన్ బౌలింగ్, మిడిల్ ఆర్డర్‌లో ఢిల్లీ బ్యాటింగ్ ఈసారి వారికి అదనపు బలాన్ని ఇస్తున్నాయి.

