మరో 18 రోజుల్లో ఐపీఎల్ 18వ ఎడిషన్ (IPL 2025) టోర్నీ ప్రారంభం కానుంది. ఈ కొత్త సీజన్ కొత్త జెర్సీతో సిద్ధమవుతున్న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ తాజాగా కెప్టెన్ ను కూడా ప్రకటించింది. సీనియర్ క్రికెటర్ అజింక్య రహానేకు జట్టు పగ్గాలు అప్పగించింది. ఇక, యువ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ కు వైస్ కెప్టెన్ బాధ్యతలిచ్చింది. ఈ మేరకు ఫ్రాంఛైజీ సోమవారం తమ అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ప్రకటించింది.
IPL 2025 | కేకేఆర్ కెప్టెన్ గా అజింక్య రహానె
