రామన్న ఉత్సవాలకు ఆహ్వానం..

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ఈ నెల 27న భీంగల్ మండలం పిప్రి లొద్ది గ్రామంలో నిర్వహించనున్న లొద్ది రామన్న కళ్యాణ మహోత్సవానికి హాజరు కావాలని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌ను గ్రామస్తులు ఆహ్వానించారు.

సోమవారం హైదరాబాద్‌లో లొద్ది రామన్న ఆలయ కమిటీ, వీడీసీ సభ్యులు సర్పంచ్ ఆరిగేల జనార్దన్ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడిని కలిసి ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు.

పీసీసీ అధ్యక్షుడిని కలిసిన వారిలో కోడిగేల నర్సయ్య, పుప్పాల చిన్న పెంటయ్య, పల్లె శ్రీను, రౌతు చిన్న నర్సయ్య తదితరులు ఉన్నారు.

Leave a Reply