గిరిజన భాషల సెమినార్ ఆహ్వానం..
ఉట్నూర్, ఆంధ్రప్రభ – భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11, 12 తేదీల్లో న్యూ ఢిల్లీలోని యశో భూమిలో జాతీయ స్థాయి గిరిజన భాషల (సెమినార్) నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కు చెందిన రచయిత, విశ్రాంతి బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మెస్రం మనోహర్, గోండి భాష నుండి గోండి భాష కోఆర్డినేటర్ తొడసం దేవురావులను పాల్గొనాలని ఆహ్వానించినట్లు తెలిపారు. జాతీయ గోండి భాష ఉత్సవాలకు కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా ఆహ్వానించడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలియచేశారు.


