బ‌హుమ‌తుల విందుకు ఆహ్వానం

బ‌హుమ‌తుల విందుకు ఆహ్వానం

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి(Chief Minister) అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

అక్టోబర్ 3న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌(Exhibition Ground)లో జరగనున్నసాంప్రదాయ బహుమతుల విందు కార్యక్రమం “అలయ్ బలయ్”లో ముఖ్యమంత్రి తప్పకుండా పాల్గొనాల్సిందిగా దత్తాత్రేయ ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం విజయదశమి సందర్భంలో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా సామాజిక, సాంస్కృతిక(Social, Cultural), రాజకీయ రంగాల ప్రముఖులు ఒకే వేదికపై కలుసుకోవడం విశేషం.

తెలంగాణ సంస్కృతిని, సామాజిక సమగ్రతను ప్రతిబింబించే “అలయ్ బలయ్”(Alay Balay)లో పాలకులు, ప్రతిపక్ష నేతలు, సాహితీవేత్తలు, సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు ఇలా విభిన్నరంగాల వారు హాజరవుతారు. ఈ వేడుకలో అందరూ ఒకరికొకరు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భోజనం చేస్తారు.

ఈ కార్యక్రమం ఏ రాజకీయ భేదాభిప్రాయాలకూ(Differences of Opinion) అతీతమని, స్నేహపూర్వక వాతావరణంలో అన్నివర్గాలను కలిపే వేదికగా కొనసాగుతుందని దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆయన ఆహ్వానాన్ని స్వీకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “అలయ్ బలయ్” తెలంగాణ సమాజానికి ఐక్యతను చాటే ఉత్సవంగా మారిందని అభిప్రాయపడ్డారు.

Leave a Reply