హైదరాబాద్ – ఉత్తర అమెరికా తెలుగు సంఘం – తానా ప్రతి రెండేళ్లకోసారి నిర్వహించే మహాసభలు ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవిలోని సబర్బన్ కలెక్షన్ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తానా కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానా ప్రతినిధులు ఆహ్వానించారు.
జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం ని ఉత్తర అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. సీఎంని కలిసిన వారిలో తానా కాన్ఫరెన్స్ చైర్మన్ నాదెళ్ల గంగాధర్, మాజీ అధ్యక్షుడు జయరామ్ కోమటి, కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి ఉన్నారు.