TDP | పెట్టుబడి సాయం కౌలు రైతులకు ఇవ్వాలి

TDP | పెట్టుబడి సాయం కౌలు రైతులకు ఇవ్వాలి

  • మంత్రికి వినతిపత్రం అందజేసిన కౌలు రైతు సంఘం నేతలు

TDP | ఘంటసాల, ఆంధ్రప్రభ : కౌలు రైతులకు పెట్టుబడి సహాయం రూ.20 వేలు ఇవ్వాలని, భూ యజమాని సంతకం లేకుండా కౌలు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడుకి ఏపీ కౌలు రైతుల సంఘం నాయకులు (AP Tenant Farmers Association leaders) కోరారు. ఘంటసాల విచ్చేసిన మంత్రికి వినతిపత్రాన్ని నేతలు అందించి సమస్యను తెలియజేశారు. అనంతరం నేతలు మాట్లాడుతూ ఎన్నికల ముందు కౌలు రైతులకు రూ.20 వేలు పెట్టుబడి సాయమందిస్తానని హామీ ఇచ్చి, 16 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదని, వారికి ఈ పథకం వర్తింపచేయాలని కోరారు. పంట రుణాలు ప్రతీ కౌలు రైతుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) నిబంధనల ప్రకారం రూ.2 లక్షల వరకు హామీ లేని, వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని కోరారు.

మొంథా తుఫాన్లు తర్వాత వీచిన గాలులకు సుంకురాలి, దిగుబడి గణనీయంగా తగ్గుతుందని, గింజ రంగు మారటం, పాయ రావటం, తప్ప, తాలు వచ్చి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుందన్నారు. దీనికి తోడు రాబోయే తుపానుల దృష్ట్యా తేమశాతాన్ని నిబంధనలు సడలించి ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని కోరారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పంచకర్ల రంగారావు (Panchakarla Ranga Rao) ఘంటసాల మండల కార్యదర్శి మేడంకి వెంకటేశ్వరరావు, చల్లపల్లి మండల కౌలు రైతు సంఘం కార్యదర్శి కోలా హరిబాబు, సీఐటీయూ నాయకులు మహమ్మద్ కరీముల్లా, కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు వాకా రామచంద్రరావు, భలే రమేష్ మోపిదేవి మండల కార్యదర్శి సురేష్ పాల్గొన్నారు.

ల్యాండ్ సమస్యలు పరిష్కరించాలని వినతి
కోడూరు మండలంలో 22ఏ (ఏడబ్ల్యూడి) భూములను, రైతుల సమస్యలు (Problems of farmers) పరిష్కరించాలని కోరుతూ టీడీపీ మండల అధ్యక్షులు బండే శ్రీ నివాసరావు మంత్రి అచ్చెంనాయుడుకు వినతిపత్రాన్ని అందజేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.

Leave a Reply