investigation | మౌనిక హత్య కేసులో కీలక అంశాలు

investigation | మౌనిక హత్య కేసులో కీలక అంశాలు

investigation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : విశాఖలో సంచలనం రేపిన మౌనిక హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు రవీంద్ర ముందుగానే ప్రణాళికతో ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు చెబుతున్నారు.

విశాఖపట్నంలో చోటుచేసుకున్న మౌనిక హత్య కేసు దర్యాప్తులో సంచలన వివరాలు బయటపడుతున్నాయి. మృతురాలు మౌనిక గతంలో రవీంద్రను బెదిరించిందని, అతని ఉద్యోగాన్ని పోగొడతానని, పరువు తీస్తానని హెచ్చరించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో రవీంద్ర ముందుగానే ప్రణాళిక రచించి, ఆన్‌లైన్ ద్వారా కత్తి సహా కొన్ని పరికరాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో మౌనికను ఇంటికి పిలిపించి మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, విభేదాలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

దీంతో ఆగ్రహానికి లోనైన రవీంద్ర మౌనికను హత్య చేసి, మృతదేహాన్ని ముక్కలుగా చేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం భయంతో తన స్నేహితుడు సందీప్‌కు విషయం చెప్పగా, అతడు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిసింది. తన ఉద్యోగం పోతుందనే, పరువు దెబ్బతింటుందనే భయంతోనే ఈ దారుణానికి పాల్పడ్డానని నిందితుడు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. పోలీసులు కేసును లోతుగా విచారిస్తున్నారు.

Leave a Reply