KNL | క్రీడాకారుడికి ఇంటర్నేషనల్ వాకర్స్ అభినందనలు

కర్నూలు బ్యూరో : కర్నూలు నగరానికి చెందిన బాబురావు మార్చి నెలలో గుడివాడలో జరిగిన రాష్ట్రస్థాయి క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో +125 విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ లో జరిగిన డబ్ల్యూపీసీ రాష్ట్రస్థాయి పోటీల్లో స్వర్ణ పథకం సాధించి అంతర్జాతీయ డబ్ల్యూపీసీకి ఎన్నికయ్యారు.

బాబురావుకి డీఎస్డీఓ భూపతి రావు వాకర్స్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్ సత్యనారాయణ రెడ్డి, సెక్రెటరీ రంగా రవి గవర్నర్ (302 )రామచంద్ర రెడ్డి, అలాగే జిమ్ మెంబర్స్ కూడా బాబురావుని అవుట్ డోర్ స్టేడియంలో ఘనంగా సన్మానించారు. అలాగే క్రీడాకారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు కళావతి, ఇబ్రహీం ఆర్థికంగా సహాయ సహకారం అందించారు.

Leave a Reply