International | రక్తదాతలు..ప్రాణదాతలు…

International | రక్తదాతలు..ప్రాణదాతలు…
International | బిక్కనూర్, ఆంధ్రప్రభ : రక్తదాతలు ప్రాణదాతలు అని బిక్కనూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సంపత్ కుమార్ మాట్లాడుతూ… వైద్యరంగం ఎంతగా అభివృద్ధి చెందిన రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని, సకాలంలో రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని అన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేస్తున్న సేవలు అభినందనీయం అని అన్నారు.

యువత రక్త దానం చేసేందుకు ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, జిల్లా అధ్యక్షుడు ఎర్రం చంద్రశేఖర్ లు మాట్లాడుతూ… తలసేమియా వ్యాధి చిన్నారుల కోసం రానున్న రోజుల్లోనే మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు.
రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను, లంచ్ బాక్స్ లను అందజేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోల్ ప్లాజా మేనేజర్లు ప్రకాష్,దుర్గా ప్రసాద్,ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకటేష్, ఉపాధ్యక్షులు రాజూరి మనోహర్, జిల్లా ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షుడు ఎల్లంకి సుదర్శన్ లు పాల్గొనడం జరిగింది.
