అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం…

అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం…

మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు మెరుగైన, అత్యవసర వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా మేడ్చల్ జిల్లా ఘన్‌పూర్‌లోని మెడిసిటి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MIMS) అనుబంధ మెడిసిటి హాస్పిటల్స్‌లో అత్యాధునిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) నేడు ప్రారంభించారు. ​నేడు ఉదయం హాస్పిటల్ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల అనంతరం, మెడిసిటి హాస్పిటల్స్ సీఈఓ (CEO) శ్రీ ఐనిష్ మర్చంట్ రిబ్బన్ కట్ చేసి ఈ నూతన ICU విభాగాన్ని ప్రారంభించారు.

​ICUలోని మొత్తం 20 పడకలతో ఈ యూనిట్ ఏర్పాటు చేయబడింది. అత్యవసర చికిత్సకు అవసరమైన అత్యాధునిక వైద్య పరికరాలు, వెంటిలెట‌ర్స్, ఐసీయూలోనే డయాలసిస్ నిర్వహించేందుకు ప్రత్యేక యూనిట్లు సిద్ధం చేయబడ్డాయి. నిష్ణాతులైన వైద్యులు, ప్రత్యేక శిక్షణ పొందిన నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది 24/7 అందుబాటులో ఉంటాయ‌న్నారు.

​ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ (ప్రెసిడెంట్, షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ మాట్లాడుతూ…​”సామాన్యులకు కూడా అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ధరల్లో అందించాలన్నదే మా లక్ష్యం. అందులో భాగంగానే ఈ ఆధునీకరించిన ICUను ప్రారంభించాం. భవిష్యత్తులో మరిన్ని అత్యాధునిక వైద్య వ్యవస్థలను మెడిసిటిలో అందుబాటులోకి తీసుకువస్తాం. అన్నారు. ​శ్రీ ఐనిష్ మర్చంట్ (CEO, మెడిసిటి హాస్పిటల్స్) మాట్లాడుతూ… ​”అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగుల ప్రాణాలను కాపాడడానికి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ఇక్కడ కల్పించాం. రోగులకు మెరుగైన సంరక్షణ అందించడానికి మా సిబ్బంది ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటార‌న్నారు.

​ఈ కార్యక్రమంలో షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ, మెడిసిటి గ్రూప్ సీఈఓ ఐనిష్ మర్చంట్, మెడికల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ డాక్టర్ సి. గీత, మెడిసిటి మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ దేవేంద్ర సింగ్ నేగి, పలువురు సీనియర్ వైద్యులు, నర్సింగ్ మరియు పారా మెడికల్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply