నిఘా వర్గాల హెచ్చరిక

  • పోలీసులు అప్రమత్తం
  • వాడవాడలా జల్లెడ


( తిరుపతి క్రైమ్ , ఆంధ్రప్రభ): తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉగ్రవాదుల బాంబు బెదిరింపులు శుక్రవారం తీవ్ర కలకలం రేపాయి. ఉగ్రవాదుల బెదిరింపులతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. తిరుపతి నగరంలో పలు ప్రాంతాల్లో బాంబు డిస్పోజబుల్ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.. తమిళనాడు కేంద్రంగా ఐఎస్ఐ, మాజీ ఎల్. టి. టి. ఈ. మిల్టెంట్లు పన్నినట్లుగా బెదిరింపు చేస్తూ గుర్తుతెలియని వ్యక్తుల మెయిల్ పంపించారు. . దీంతో తిరుపతి నగరంలో నాలుగు ప్రాంతాల్లో ఆర్ డి ఎక్స్  పేల్చబోతున్నట్లు మెయిల్ వచ్చింది.

తనిఖీలు ముమ్మరం

తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, శ్రీనివాసన్ విష్ణు నివాసం, తో పాటు గోవిందరాజు స్వామి ఆలయం కపిల్ తీర్థం ప్రాంతాల నందు విస్తృతంగా తనిఖీ కార్యక్రమాన్ని బాంబు స్క్వాడ్, డాగ్స్ స్క్వాడ్ తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టడంతో పాటు కోర్టు, జడ్జిల నివాస సముదాయం తో పాటు వివిధ ప్రాంతాల్లో అనుమానం ఉన్నటువంటి స్టార్ హోటల్స్, తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నెల ఆరవ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పర్యటన నేపథ్యంలో వ్యవసాయ కళాశాల హెలి ప్యాడ్, వద్ద తనిఖీలు చేపట్టడం జరుగుతున్నది. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుమల నందు విస్తృతంగా బీడీ టీమ్స్ తనిఖీలు చెప్పడంతో పాటు జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ వాహన తనిఖీలు కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ఇతర రాష్ట్రాల వాహనాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Leave a Reply