20 రూపాయల బీమాతో రూ. 2లక్షల సాయం..

20 రూపాయల బీమాతో రూ. 2లక్షల సాయం..

ఉమ్మడి కరీంనగర్‌ బ్యూరో(ఆంధ్రప్రభ ) : గ్రామీణ ప్రాంతాల్లో వలసలు అరికట్టడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. పల్లె వాసులకు వ్యవసాయ పనులు లేని సమయంలో స్థానికంగా ఉపాధిని కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకంతో గ్రామీణ ప్రాంతాల్లోని వారందరికీ ఉపాధి దొరుకుతుంది. సాధారణ రోజుల్లో వ్యవసాయ పనులకు వెళుతూ, ఉపాధి హామీ పని పెట్టినప్పుడు ఆ పనులకు వెళ్లడం వల్ల సంవత్సరం పొడవునా పని దొరికినట్లు- అవుతుంది. ఈ పను లకు వెళ్లిన కుటు-ంబం ఆ ఏడాది పనులకు సంబంధించి వేల రూపాయలను సంపా దిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు పని ప్రదేశాల్లో పని చేసే ఎవరి-కై-నా ప్రమాదం జరి గితే అక్కడే సాయం అందేది. కానీ ఆ సాయం బాధితులకు ఏ మాత్రం సరిపోయేది కాదు.


పీఎంఎస్‌బీవై పథకం అమలు
ఉపాధి హామీ కూలీలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై) పథ కాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా వచ్చే పరిహారమే కాకుండా అదనంగా పరిహారం అందనుంది. కేవలం రూ.20ల బీమాకే కూలీ మృతి చెందినా, శాశ్వత వైక ల్యం పొందిన రూ.2 లక్షలు సాయం అందుతుందన్న విషయం ఎంతమందికి తెలు సు? అలా పాక్షిక వైకల్యం సంభవిస్తే ఎంత మొత్తం ఇస్తారో తెలుసా?


కూలీలకు వచ్చే అదనపు సాయం ఇలా..
ఈజీఎస్‌తో పాటు- పీఎంఎస్బీవై ద్వారా అందే సాయం కుటు-ంబాలకు అదనంగా ప్రయోజనం తీసుకురానుంది. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్లలోపు ఉపాధి కూలీలు దర ఖాస్తుకు ఇక్కడ అర్హులు. పోస్టాఫీస్‌, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్న కూలీలు రూ.20 చెల్లించి ఈ పథకంలో నమోదు చేసుకోవాలి. అయితే ఈ పథకంపై చాలా మంది కూలీలకు అవగాహన అనేది లేదు. కనీసం అక్కడ ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా ఉండే వాళ్లు కూడా ఈ విషయాన్ని కూలీలకు తెలియజేయడం లేదు.


బీమాకు అర్హులు ఎవరంటే?
వచ్చే బీమా వాటాధనం తక్కువైనా తెలియక చాలా మంది చెల్లించడం లేదు. దీంతో ఉపాధి హామీ సిబ్బంది అవగాహన కల్పిస్తూ బీమా ఇప్పుడిప్పుడే చేయిస్తున్నారు. అనుకోని ఘటనలతో కూలీ మృతి చెందినా, శాశ్వత వైకల్యం పొందిన రూ.2 లక్షలు సాయం ఆ కుటు-ంబానికి అందుతుంది. పాక్షిక వైకల్యం సంభవించినా రూ.లక్ష పరిహారం వారికి అందనుంది. ఈ పథకంతో ప్రమాదాలు జరిగిన సమయంలో కూలీ లకు భరోసా అన్నది దక్కుతుంది. ఆ ప్రమాదం మాత్రం కేవలం పని జరిగిన ప్రదేశం లోనే జరిగితేనే బీమాకు అర్హులు. కరీంనగర్‌ జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది కేంద్రం 12 లక్షల పని దినాలు కేటాయించింది. వాటిలో ఇప్పటికే 10 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. కార్డులో సుమారు 1.99 లక్షల మంది నమోదైనప్పటికీ 50 శాతం మాత్రమే జనాలు ఉపాధి హామీ పథకంలో ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు. మిగతా వారు ప్రభుత్వ ప్రయో జనాలకు నమోదై ఉన్నారు. పనులకు హాజరయ్యే కూలీల్లో నిరుపేద కుటు-ంబాలే అధి కంగా ఉన్నాయి. వృద్ధాప్యంలో సైతం కుటు-ంబ పోషణకు ఉపాధి పనులకు వస్తు న్నారు. కూలీల శ్రమ ఫలితంగా జిల్లాలో పనులు బహుళ ప్రయోజనాలు ఇస్తున్నాయి. ఇక్కడి వరకు బాగానే ఉన్నా పని ప్రదేశాల్లో ఏవైనా అనుకోని ప్రమాదాలు బాధితులకు నిబంధనల ప్రకారం పరిహారం అందేది. మరణం సంభవిస్తే రూ.2 లక్షలు, అం గవైకల్యానికి రూ.లక్ష, గాయాలకు అవసరమైన వైద్య ఖర్చులు అందేవి. ఈ సాయం కుటు-ంబాలకు ఏమాత్రం సరిపోయేది కాదు. దీంతో అదనంగా సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వం పీఎంఎస్బీవైని కూలీలకు వర్తింపజేయాలని ఆదేశాలిచ్చింది.
జిల్లా వివరాలు..
గ్రామాలు – 260, ఉపాధి హామీ కార్డులు – 98,036, కార్డుల్లో సభ్యులు – 1,99,728, యాక్టివ్‌ కార్డులు – 60,697, యాక్టివ్‌ సభ్యులు – 93,353

Leave a Reply