వికారాబాద్, జులై 7 (ఆంధ్రప్రభ): వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే జంక్షన్ లో ఎస్కలేటర్ (Escalator) ఏర్పాటు చేయాలని గత పది సంవత్సరాలుగా స్థానికులు కోరుతున్నప్పటికీ రైల్వే అధికారులు స్పందించడం లేదు. ప్రస్తుతం వికారాబాద్ (Vikarabad) జంక్షన్ లో మూడు ప్లాట్ ఫామ్ లు ఉన్నాయి. ఒక ప్లాట్ ఫామ్ (Platform) నుండి మరో ప్లాట్ ఫామ్ లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా వృద్ధులకు, వికలాంగులకు ఎస్కలేటర్ ఎంతైనా అవసరం ఉంది.
గతంలో రైల్వే జీఎం వికారాబాద్ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతవాసులు నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్కలేటర్ కోసం వినతి పత్రం అందించారు. గత కొంతకాలం క్రితం వికారాబాద్ లోని ప్లాట్ ఫామ్ 1 2 లో లిఫ్ట్ ఏర్పాటు చేశారు. రైల్వే అధికారులు స్పందించి రైల్వే జంక్షన్ లో ఎస్కలేటర్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.