పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

రూ,3,500 నగదు, పేకాట ముక్కలు స్వాధీనం
ఏడుగురి అరెస్ట్
చిట్యాల ఎస్ఐ సతీష్ వెల్లడి

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జూకల్లో బుధవారం సాయంత్రం పేకాడుతున్న స్థావరాలపై పోలీసులు దాడి చేసి పేకాడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ తెలిపారు . వారి వద్ద రూ 3500 నగదు, 52 పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చింతపాక ఆంజనేయులు,మొలుగూరి అశోక్, బండారి రాజు,బండారితరుణ్,బండారి సురేష్,కొమ్మూరి కుమార్, కీర్తి అశోక్, జూకల్ గ్రామస్తులున్నారు.

జూకల్ గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు మూడు ముక్కలాట ఆడుతున్నారనే సమాచారం మేరకు, చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్, తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి నిర్వహించారు. పోలీసులను చూడగానే నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా, అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు.


ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ, యువత వ్యసనాలకు బానిసలై తమ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎస్సై అన్నారు.

Leave a Reply