చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు..

చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు..
- ఇబ్రహీంపట్నంలో హెల్మెట్ పై విస్తృత తనిఖీలు
- రోడ్డు భద్రతపై అవగహన కల్పించిన సీఐ, డి.చంద్రశేఖర్ సూ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోవద్దని ట్రాఫిక్ సీఐ డి.చంద్రశేఖర్ సూచించారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని రింగ్ సెంటర్ లో వాహనదారులకు రోడ్డు భద్రతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.
ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండదన్నారు. హెల్మెట్ వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహిస్తామన్నారు. దీనిపై నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ, ఆర్ఎస్సైలు శివరామకృష్ణ, బి.లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.
